ప్రజారోగ్యానికి పెను సవాల్ విసురుతున్న దోమలపై హైటెక్ యుద్ధానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. దోమల నియంత్రణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు ఉపయోగించనుంది. ఏఐ ఆధారంగా పనిచేసే స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ ద్వారా దోమలను కట్టడి చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతిలో పైలెట్ ప్రాజెక్టు కింద ఈ విధానాన్ని పరిశీలించనున్నారు. అక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా మరిన్ని నగరాలకు విస్తరించాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. తిరుపతిలో ప్రైవేట్ సంస్థకు ఈ పనులు అప్పగించనున్నారు.