ధనత్రయోదశి పర్వదినం వేళ.. చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

1 hour ago 2
ధనత్రయోదశి పర్వదినం సందర్భంగా చార్మినార్‌ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ప్రత్యేక పూల అలంకరణలు, ఎల్ఈడీ దీపాలు ఆలయానికి పండుగ కళను తీసుకొచ్చాయి. దీపావళి సందర్భంగా ఈనెల 8 నుంచి 11వ తేదీ అర్ధరాత్రి వరకు ఆలయాన్ని తెరిచి ఉంచి భక్తులకు నాణేలు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం 4 ప్రవేశ, నిష్క్రమణ మార్గాలతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసుల సహకారంతో భద్రతా చర్యలు చేపట్టారు. నగరంలోని ఇతర లక్ష్మీదేవి ఆలయాల్లోనూ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
Read Entire Article