ధర్మవరంలో ఉగ్ర కలకలం.. పాక్ ఉగ్రవాదులతో చాటింగ్

11 months ago 21
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. కోట కాలనీకి చెందిన నూర్ అనే అనుమానిత వ్యక్తిని ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. ధర్మవరంలోని ఓ హోటల్‌లో వంటమనిషిగా పనిచేస్తున్న నూర్, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నాడని ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. నూర్ నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు 16 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సిమ్‌కార్డుల ద్వారా అతను ఎవరితో మాట్లాడాడు అనే దానిపై ఎన్‌ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు.
Read Entire Article