ధర్మస్థల ఆలయ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఈసారి ఈ వివాదంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ పేరు వినిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి స్పందించారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ప్రకాష్ రాజ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కుట్రలో ప్రకాష్ రాజ్ పేరు రావటం సిగ్గుచేటని విమర్శించారు. ప్రకాష్ రాజ్ ఎక్కడికి పారిపోయారని.. వెంటనే బయటకు వచ్చి హిందువులను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.