రబీ సీజన్‌లో ధాన్యం దిగుబడికి అనుగుణంగా గన్నీ సంచులు అందుబాటులో ఉంచామని.. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతులకు నగదు జమ చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతు మహోత్సవంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేశామని, త్వరలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని తెలిపారు. ‘భూభారతి’ చట్టం పకడ్బందీగా అమలు చేస్తామని, ధరణితో నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.