నందిగామ: నడిరోడ్డుపై దొరికిన నోట్ల కట్ట.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన పూజారి..

6 days ago 4
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రామ్ శర్మ అనే అర్చకుడు తన నిజాయితీని చాటుకున్నారు. గురువారం రాత్రి రామ్ శర్మకు నడిరోడ్డుపై లక్ష రూపాయల నగదు దొరికింది. అయితే ఈ నగదును పోగొట్టుకున్న వారికి అందించాలని నిర్ణయించుకున్న రామ్ శర్మ.. ఎవరైనా డబ్బులు పోగొట్టుకుని ఉంటే తనను సంప్రదించాలంటూ సోషల్ మీడియాలో వివరాలు పంచుకున్నారు. దీంతో డబ్బులు పోగొట్టుకున్న మురళీ కృష్ణ అనే గొర్రెల వ్యాపారి.. రామ్ శర్మను సంప్రదించారు. వివరాలు కనుకున్న రామ్ శర్మ.. డబ్బులు మురళీకృష్ణవేనని నిర్ధారించుకుని అతనికి సొమ్ము అందజేశారు.
Read Entire Article