Nandyal Four Killed In Slab Collapse: నంద్యాల జిల్లాలో మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. చాగలమర్రి మండలం చిన్న వంగలిలో ఈ ఘటన జరిగింది. చనిపోయిన వారిని గురుశేఖర్‌రెడ్డి (45), దస్తగిరమ్మ (38) దంపతులు, వారి ఇద్దరు కుమార్తెలు పవిత్ర (16), గురులక్ష్మి(10)గా గుర్తించారు. కుటుంబంలో మొత్తం ఐదుగురు ఉండగా.. రెండో కుమార్తె ప్రసన్న కడప జిల్లా ప్రొద్దుటూరు ఉషోదయ పాఠశాలలో చదువుతోంది.