హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు.. హడలెత్తిస్తోన్న విషయం తెలిసిందే. చెరువులు కుంటలను ఆక్రమించి అక్రమంగా నిర్మించిన కట్టడాలపైకి బుల్డోజర్లు ప్రయోగిస్తూ.. హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే.. హైడ్రా పంపిస్తోన్న బుల్డోజర్లు.. ఏ రాజకీయ నేతల బెదిరింపులకు, సినీ ప్రముఖుల పాపులారిటీకి ఆగిపోవటం లేదు. ఇప్పటికే నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేసిన హైడ్రా.. ఇప్పుడు సీనియర్ నటుడు మురళీమోహన్‌కు చెందిన జయభేరీపై ఫోకస్ చేసింది.