తనను ఇబ్బంది పెట్టాలనేదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. నేడు ఫార్ములా ఈ కారు రేసు కేసులో విచారణకు ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన ఆయన.. అక్కడ మీడియాతో మాట్లాడారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఈ డ్రామా అంతా జరుగుతోందని ఆరోపించారు. ఏసీబీ విచారణకు తాను లాయర్లను తెచ్చుకుంటే వాళ్లకు ఎందుకు అంత భయమని ప్రశ్నించారు. తమ వెంట లాయర్లే లేకపోతే.. తాను ఇవ్వని స్టేట్‌మెంట్‌ను ఇచ్చినట్లుగా లీకులిస్తారని సంచలన ఆరోపణలు చేశారు.