తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీల నేతలే కాదు.. సొంత పార్టీ నాయకులు కూడా బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. మొన్నటివరకు తీన్మార్ మల్లన్న ఓ వర్గంపై ఘాటు కామెంట్లు చేయగా.. ఇప్పుడు సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ హాట్ కామెంట్లు చేశారు. పార్టీలోని ఓ వర్గానికి చెందిన నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో తనను కేంద్ర మంత్రి కాకుండా అడ్డుకున్నారంటూ పలు సందర్భాలు ప్రస్తావిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.