గుంటూరు జిల్లా నరసరావుపేటలో భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. విజయవాడ కేంద్రంగా నడుస్తున్న యానిమేషన్ సంస్థ యజమాని రూ.400 కోట్లతో పరారయ్యాడు. దేశ విదేశాల్లో సినిమాలకు యానిమేషన్ సేవలు అందిస్తున్నామని నమ్మబలికి.. వ్యాపారుల నుంచి భారీగా పెట్టుబడులు ఆకర్షించి ఇటీవల అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.