నల్గొండ జిల్లా దామరచర్ల మండలం పొత్తలపాలెం గ్రామంలో రోడ్డు పక్కన ఓ పంట పొలంలో నోట్ల కట్టలు కలకలం రేపాయి. రూ. 500 నోట్లు 40 వరకు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. వాటిని చూసి షాక్‌కు గురైన రైతు అసలు విషయం తెలిసి ఖంగుతున్నాడు. అవి నకిలీ నోట్లుగా గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.