తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త వినిపించారు. ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాల్లో భాగంగా.. నల్గొండ జిల్లా గంధంవారిగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఎవరు అడ్డుపడినా.. డబ్బులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, మాజీ సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.