అక్రమ ఫామ్ హౌసులు కూల్చడానికి బుల్డోజర్లను సిద్ధం చేసినట్లు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఎవరు అడ్డం వస్తారో రండి అంటూ సీఎం సవాల్ విసిరారు. ఆక్రమణదారులే హైడ్రాని చూసి భయపడుతున్నారని.. హైడ్రా అనగానే కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల బయటకు వచ్చారన్నారు. ఎవరూ అడ్డం వచ్చినా.. వారందరినీ చెరువుల్లో వేసి తొక్కుతాం అని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కొందరు హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని.. అటువంటి వారి పట్ల కఠినంగా ఉంటామని హెచ్చరించారు.