టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా.. గాంధీ భవన్‌లో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. తన ఎత్తుపై పదే పదే.. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన ఎత్తు గురించి మాట్లాడుతుంటే.. తాను కూడా రేవంత్ రెడ్డి ఎత్తు గురించి మాట్లాడటం పెద్ద కష్టమేమీ కాదని.. కానీ తనకు మర్యాద, సంస్కారం అడ్డొస్తున్నాయని హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.