Swaroopanandendra Saraswati Letter On Security: విశాఖపట్నం శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. తనకు కల్పిస్తున్న ఎక్స్ 1+1 భద్రతను వెనక్కు తీసుకోవాలని కోరారు. తనకు 2019 నుంచి ఇప్పటి వరకు భద్రతను కల్పించినందుకు.. గత, ప్రస్తుత ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. తనకు కేటాయించిన ఇద్దరు గన్‌మెన్‌లను వెనక్కు తీసుకోవాలని కోరారు. తనకు కల్పించిన భద్రతను వెనక్కు పంపడానికి కారణాలను స్వరూానంద స్వామి లేఖలో ప్రస్తావించారు.