బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసా తీవ్ర ఆరోపణలు చేశారు. జైలుకు వెళ్లేందుకు కేటీఆర్‌కు అంత ఆతృత ఎందుకని.. తప్పు రుజువైన రోజు తప్పకుండూ జైలుకు వెళ్తారంటూ కీలక ఆరోపణలు చేశారు. మెడలో పార్టీ కండువా కప్పి దానితో తన గొంతు కోశారని.. ఐదేళ్ల తన రాజకీయ జీవితాన్ని నాశనం చేశారంటూ బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.