ఆర్టీసీ బస్సు ఎక్కిన ఓ మహిళ.. హల్‌చల్ చేసింది. ఆ బస్సు డ్రైవర్, కండక్టర్ మాత్రమే కాకుండా అందులో ఉన్న ప్రయాణికులను కూడా హడలెత్తిచ్చింది. ఫుట్‌పాత్‌పై నిలబడవద్దని డ్రైవర్ సూచించినందుకు తీవ్ర ఆగ్రహం చెందిన ఆ మహిళ.. తనకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించింది. తన ఫోటో తీసుకుని పోలీసులకు చూపిస్తే.. వారికే దడ పుడుతుందంటూ తీవ్ర హెచ్చరికలు చేసింది. చివరికి ఆమెను డ్రైవర్, కండక్టర్ పోలీసులకు అప్పగించారు.