డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ‘నషా ముక్త్ భారత్ యాత్ర’ నిర్వహించనున్నారు. ఈ యాత్రలో పాల్గొనాలని అక్కినేని నాగార్జునను ఆయన నివాసానికి వెళ్లి కిషన్ రెడ్డి ఆహ్వానించారు. డ్రగ్స్ నిర్మూలన కోసం చేపడుతున్న ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం ఇద్దరూ కలిసి యాత్ర టీ-షర్టులను ఆవిష్కరించారు. డ్రగ్స్ రక్కసిని అంతమొందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని నాగార్జున పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం జరిగే కార్యక్రమాలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. 2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంతో ఈ యాత్ర చేపడుతున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.