తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి 'జగ్గారెడ్డి-ఏ వార్ ఆఫ్ లవ్' చిత్రంలో నటిస్తున్నాడు. ఉగాది సందర్భంగా సినిమా ఆఫీస్ ప్రారంభించి టీజర్ విడుదల చేశారు. సినిమాలో జగ్గారెడ్డి జీవితంలోని పలు అంశాలను చూపించనున్నారు. ఈ సినిమాకు జయలక్ష్మీ రెడ్డి నిర్మాతగా, రామానుజం దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపై ఈ సినిమా కార్యాలయమే నా అడ్డ అని చెప్పుకొచ్చారు. మున్సిపల్ చైర్మన్‌గా, కౌన్సిలర్‌గా, విద్యార్థి నేతగా తన విజయవంతమైన ప్రయాణం సినిమాలో చూడబోతున్నారని జగ్గారెడ్డి వెల్లడించారు.