ఏపీ మండలి సమావేశాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. లడ్డూలో కల్తీ నెయ్యి విషయంపై బుధవారం మండలిలో చర్చ జరిగింది. అయితే చర్చ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్, మండలి ఛైర్మన్ మోషేన్ రాజును.. మంత్రి అచ్చెన్నాయుడు క్రిస్టియన్ అని సంభోధించడం వాగ్వాదానికి దారితీసింది. దీనిపై వైసీపీ సభ్యులు మండిపడ్డారు. అచ్చెన్నాయుడు వ్యా్ఖ్యలపై మండలి ఛైర్మన్ మోషేన్ రాజు కూడా అభ్యంతరం తెలిపారు. తాను క్రిస్టియన్ కాదని.. హిందువునని.. తన కులం గురించి మాట్లాడి తనను కించపరుస్తున్నారని ఛైర్మన్ అన్నారు. అనంతరం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.