ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇవాళ ఉదయం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో పోలీసుల ఎదుట హాజరయ్యారు. బెయిల్ షరతుల మేరకు ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆయన హాజరై సంతకం పెట్టాల్సి ఉంది. ఈ మేరకు ఉదయమే స్టేషన్‌కు వెళ్లిన అల్లు అర్జున్ అక్కడం సంతకం పెట్టారు. ఆయనతో పాటుగా మామ చంద్రశేఖర్ రెడ్డి సైతం స్టేషన్‌కు వెళ్లారు. కాగా.. సంతకం పెట్టిన తర్వాత కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్‌ను పరామర్శించాలని అల్లు అర్జున్ అనుకున్నారు. కానీ పోలీసులకు సమాచారం తెలిసి అక్కడకు వెళ్లవద్దని నోటీసులు ఇచ్చారు.