నాకు పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయి.. లక్ష్మి సంచలన వ్యాఖ్యలు

1 month ago 6
జనసేన నేత కిరణ్‌ రాయల్‌ తనకు ఇవ్వాల్సిన నగదు మొత్తం ఇచ్చేదాకా పోరాడుతూనే ఉంటానన్నారు లక్ష్మి. తనకు ఎలాంటి రాజకీయ పార్టీ మద్దతు లేదని.. తనను కాంప్రమైజ్‌కు రావాలని డిప్యూటీ సీఎం పవన్‌ క​ల్యాణ్‌ ఆఫీస్‌ నుంచి ఫోన్లు వస్తున్నాయన్నారు. కిరణ్ రాయల్‌తో జరిగిన ఆర్థిక లావాదేవీలు అన్నింటికీ ఆధారాలు ఉన్నాయి. స్థానిక సీఐ నాకు సెటిల్‌మెంట్‌ చేయిస్తానని హామీ ఇచ్చారని.. మొదటి నుంచి చెబుతున్నట్లు తనకు ఈ పోరాటంలో ఏ పార్టీ మద్దతు లేదన్నారు. తన ఆరోగ్యం బాగోలేకున్నా.. తన పిల్లలు వద్దని చెప్పినా.న్యాయ పోరాటం చేస్తున్నానన్నారు. తనను రకాలుగా ట్రోల్‌ చేస్తున్నారని.. అయినా తన పోరాటం ఆపనన్నారు. తాను విడుదల చేసిన వీడియోలు,ఫోటోలు అన్ని వాస్తవాలు. వాటన్నింటిని ఏడాది క్రితమే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తీసుకున్నారన్నారు. ఇంతకాలం సైలెంట్‌గా ఉండి ఇప్పుడేమో.. కాంప్రమైజ్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. విజయవాడ వచ్చి కలవాలని పవన్‌ కల్యాణ్‌ పీఏ దగ్గరి నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయన్నారు. కానీ తన పిల్లల భవిష్యత్‌ కోసం తాను వెళ్లవద్దని అనుకుంటున్నానన్నారు.
Read Entire Article