నాగర్‌కర్నూల్ జిల్లాలో 16 ఏళ్ల ఇంటర్ స్టూడెంట్ స్కానింగ్ సెంటర్ టాయిలెట్‌లో శిశువుకు జన్మనిచ్చింది. కడుపునొప్పితో పరీక్షల కోసం స్కానింగ్ సెంటర్‌కు వెళ్లిన బాలిక అక్కడే ప్రసవించింది. అనంతరం పరువు పోతుందనే భయంతో ఆ పసికందును తల్లి సాయంతో చెత్తబుట్టలో పడేసింది. సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా..వారు తల్లీబిడ్డలను ఆసుపత్రికి తరలించారు.