నాగర్‌ కర్నూల్: వృద్ధురాలి మృతదేహాన్ని చెత్త ఆటోలో తరలించిన అధికారులు.. ఫొటోలు వైరల్

2 weeks ago 3
ఓటు వేసి ప్రజాస్వామ్య బాధ్యతను నెరవేర్చాలని వచ్చిన ఆ తల్లి.. ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయింది. అయితే విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. హుటాహుటిన రంగంలోకి దిగారు. ఆపై మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఏ అంబులెన్సులోనే, ప్రైవేటు వాహనంలోనో, ఇవేవీ లేవంటూ వైకుంఠ రథంలోనే ఆస్పత్రికి తరలించాల్సింది పోయి మున్సిపాలిటీకి చెందిన చెత్త ఆటోలో తరలించారు. ఈ విషయం గుర్తించిన ఓ కౌన్సిలర్ భర్త దీన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టగా.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
Read Entire Article