మూడు రాష్ట్రాల్లో 18 నేరాలు.. ఏ కేసులోనూ పట్టుబడలేదు.. చివరికి ఒంగోలులో పాపం పండింది!

2 hours ago 1
కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 18 చోరీలు చేసి కనీసం పోలీసు రికార్డులో పేరు కూడా ఎక్కకుండా జాగ్రత్తపడిన దొంగను ఒంగోలు పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఒంగోలులో ఒకేరోజు రెండు చోరీలు చేసిన దొంగను చాకచక్యంగా అరెస్టు చేయడంతో అతను గతంలో చేసిన దొంగతనాలన్నీ బయటకొచ్చాయి. అసలు పేరు కాకుండా ఊరికో పేరుతో తిరుగుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కర్ణాటకకు చెందిన అతను ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. అతని నుంచి రూ. 1.03 కోట్ల విలువైన బంగారం, రూ. 15 లక్షల నగదు, రూ. 18 లక్షల విలువైన కారును స్వాధీనం చేసుకున్నారు.
Read Entire Article