ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన నాగార్జున యూనివర్సిటీ రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో కీలక తీర్పు వెలువరించింది. రిషితేశ్వరి ఆత్మహత్య కేసును కొట్టివేస్తూ గుంటూరు జిల్లా కోర్టు శుక్రవారం సంచలన తీర్పును ఇచ్చింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ నేరం నిరూపించడంలో విఫలం అయిందని గుంటూరు జిల్లా కోర్టు పేర్కొంది. ర్యాగింగ్, వేధింపుల కారణంగా 9 ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి కేసు.. అప్పట్లో రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.