ఆదివాసీల ఆరాధ్య దైవంగా.. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లో పూజలందుకునే నాగదేవతకు ఏటా పుష్యమాసం అమావాస్య రోజు రాత్రి నుంచి ఐదు రోజుల పాటు ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. ఈ జాతర కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీలు తరలివస్తారు. మహాపూజలో భాగంగా పవిత్ర గోదావరి నదీ జలంతో నాగదేవతకు అభిషేకంతో జాతర ప్రారంభమవుతుంది. కాగా, ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఏర్పాట్లపై అధికారులు సమీక్ష నిర్వహించారు.