జీవో నం. 317 వల్ల ఇబ్బంది పడుతున్న ఉద్యోగులకు న్యాయం చేస్తామన్న ఎన్నికల హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఆయన రాసిన లేఖను గుర్తు చేస్తూ.. బాధితులకు వెంటనే 'వన్ టైం రిలీఫ్' కింద స్వస్థలాలకు బదిలీలు చేపట్టాలని కోరారు. స్థానికత నిబంధనలను సవరించి ఉద్యోగుల మానసిక క్షోభను తొలగించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.