Pamuru Young Woman Ends Life: మార్కాపురం జిల్లా పామూరు మండలం అయ్యవారిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. యువతి యువకుడ్ని ప్రేమించింది.. అతడికి గతంలోనే వివాహమైనట్లు తెలిసింది. అప్పటి నుంచి అతడ్ని దూరం పెట్టింది. యువకుడు ఇద్దరు సన్నిహితంగా ఉన్న వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో ఆ యువతి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. చనిపోయే ముందు ఆ యువతి తన చేతిపై నాన్న జాగ్రత్త అని రాసుకుంది.