భారత క్రికెట్ జట్టు యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి నాలుగేళ్ల తర్వాత తన స్వగ్రామమైన విశాఖపట్నం జిల్లా గాజువాక సమీపంలోని తుంగ్లంకు చేరుకున్నారు. నితీశ్ రెడ్డికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన తన నానమ్మను కలిసి ఆశీర్వాదాలు తీసుకుని, ఆమెకు బంగారు గాజులు తొడిగి ప్రేమాభిమానాలు చాటుకున్నారు. భారత్ తరఫున ఆడాలన్న నానమ్మ కలను నిజం చేసినట్లు నితీశ్ తెలిపారు.