ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు, నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డు సాధించాడు. చెస్‌లో వేగంగా పావులు కదపడం ద్వారా నార దేవాన్ష్ రికార్డు నెలకొల్పాడు. 175 పజిల్స్ వేగంగా పూర్తిచేసి.. వేగవంతమైన చెక్ మేట్ సాల్వర్ -175 పజిల్స్ ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్నాడు. నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డు సాధించడం పట్ల అతని కుటుంబసభ్యులు సంతోషం వయ్క్తం చేస్తున్నారు. నారా దేవాన్ష్ చెస్ ప్రయాణంలో ఈ రికార్డు ఓ మైలురాయిగా దేవాన్ష్ కోచ్ చెప్తున్నారు.