Nara Devaansh World Record In Chess: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. చెస్‌లో క్లిష్టమైన 175 పజిల్స్‌ను వేగంగా పరిష్కరించి వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. 'ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్'గా గుర్తింపు పొందారు. లండన్‌లో జరిగిన వేడుకలో ఈ అవార్డును అందుకున్నారు దేవాన్ష్. చిన్న వయసులోనే దేవాన్ష్ చెస్‌లో సత్తా చాటుతున్నారు. ఈ ఘనతపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.