తిరుమలలో రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ సైతం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూ వస్తోంది. శ్రీవారి దర్శనం, వసతి, లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం వంటి విషయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే తిరుమలలో భక్తుల రద్దీ నియంత్రణకు ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ కీలక సూచన చేశారు. తిరుపతిలో బుధవారం నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ నియంత్రణపై కీలక సూచనలు చేశారు.