హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు, ప్రభుత్వ ఆస్తులు కాపాడునేందుకు ఏర్పడిన హైడ్రా ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ హైడ్రా కూల్చివేతలను కొంతమంది సపోర్ట్ చేస్తుండగా.. మరికొంత మంది మాత్రం విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే హైడ్రాతో పాటు సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కళ్లల్లో ఆనందం కోసమే ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చేవేశారంటూ ఆరోపించారు.