Allari Naresh In Nidadavolu Sub Registrar Office: అల్లరి నరేష్ నిడదవోలు వచ్చారు.. అక్కడ రిజిస్ట్రార్ ఆఫీసులో కొన్ని ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. తన సోదరుడు ఆర్యన్ రాజేష్‌తో కలిసి కుటుంబానికి సంబంధించిన ఆస్తుల గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కేవలం పది నిమిషాల్లోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యింది. ఆ వెంటనే ఆయనకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా అందజేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.