Pawan kalyan Tweet on Nitish kumar reddy: మెల్‌బోర్న్ టెస్టులో సెంచరీతో సత్తాచాటిన క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. క్రీడా, రాజకీయ ప్రముఖులు నితీష్ కుమార్ రెడ్డిపై సోషల్ మీడియా ద్వారా అభినందనల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. నితీష్ కుమార్ రెడ్డిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. అయితే అందరిలా కాకుండా కాస్త భిన్నంగా వ్యవహరించారు పవన్. నితీష్ కుమార్ రెడ్డి విశాఖ వాసి కావటంతో అందరూ తెలుగు కుర్రాడు అంటూ పోస్టులు పెడుతుంటే.. పవన్ మాత్రం ప్రాంతం కాదు దేశం ముఖ్యం అనేలా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.