తెలంగాణ ఉభయసభలను రాఘవ కన్‌స్ట్రక్షన్స్ వ్యవహారం తీవ్రంగా కుదిపేస్తోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా నిన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆందోళన చేపట్టగా.. 24 మంది సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇవాళ శాసనమండలిలోనూ అదే తీరు పునరావృతమైంది. ఆందోళన చేస్తున్న 11 మంది ఎమ్మెల్సీలను ఒక రోజు సస్పెండ్ చేశారు.