హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో రూ. 30 కోట్ల వ్యయంతో అత్యాధునిక 'ట్రూబీమ్ లీనియర్ యాక్సిలరేటర్' యంత్రం అందుబాటులోకి వచ్చింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చయ్యే ఈ చికిత్సను తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందించనుంది. హై-రెజల్యూషన్ ఇమేజింగ్‌తో ఆరోగ్యకరమైన కణాలకు నష్టం కలగకుండా అత్యంత కచ్చితత్వంతో క్యాన్సర్ కణితులను ఇది తొలగిస్తుంది. మెదడు, ఊపిరితిత్తులు, వెన్నెముక వంటి సున్నిత భాగాల్లోని ట్యూమర్లను తక్కువ సమయంలోనే సర్జరీ లేకుండా నయం చేయడం ఈ యంత్రం ప్రత్యేకత.