తెలంగాణలోని నిరుద్యోగ మహిళలకు మహిళా సాధికార సంస్థ శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో నిరుద్యోగ మహిళలకు.. ఎలక్ట్రిక్ ఆటోలు, ద్విచక్రవాహనాల డ్రైవింగ్ నేర్పించాలని నిర్ణయించింది. ఈ డ్రైవింగ్‌ను మహిళలకు ఉచితంగానే 45 నుంచి 60 రోజుల పాటు నేర్పించనున్నట్టు పేర్కొన్నారు. కేవలం డ్రైవింగ్ నేర్పించటమే కాకుండా.. సబ్బిడీపై ఎలక్ట్రిక్ ఆటోలు కూడా అందించనున్నట్టు ఉమెన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ శోభారాణి తెలిపారు.