సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా పరిధిలోని రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ (ఆర్కేపీ ఓసీపీ) రెండో దశ విస్తరణ ప్రాజెక్టును ప్రకటించింది. జీఎం ఎన్. రాధాకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రాజెక్టు ద్వారా 18 ఏళ్ల పాటు మైనింగ్ కార్యకలాపాలు సాగుతాయి. ముఖ్యంగా.. ఈ విస్తరణ వల్ల 156 మందికి శాశ్వత ఉద్యోగాలు, 794 మందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు లభించనున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకాల్లో స్థానిక నిరుద్యోగులకే అధిక ప్రాధాన్యం కల్పిస్తామని జీఎం హామీ ఇచ్చారు. ప్రాజెక్టు కోసం రూ. 442.90 కోట్లు కేటాయించారు.