Andhra Pradesh Work From Home Jobs Koushalam Exams December 2nd: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు వర్క్‌ఫ్రం హోం ఉద్యోగాలు కల్పించేందుకు 'కౌశలం' పేరుతో సర్వే నిర్వహించి, గ్రామ-వార్డు సచివాలయాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు చేపట్టింది. ఈ పరీక్షలు అభ్యర్థుల విద్యార్హత, ప్రతిభను బట్టి ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు వివిధ అంశాలపై అంచనా వేసి, అర్హులకు ఉచిత శిక్షణతో పాటు స్థిర ఆదాయం కల్పించే లక్ష్యంతో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.