ఏపీలో ఉన్న నిరుద్యోగులకు ఒక మంచి సదావకాశం అని చెప్పొచ్చు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కింద స్థానికంగానే కాకుండా విదేశాల్లోనూ పనిచేసే అవకాశం ఉంది. వారి వారి విద్యార్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. అమరరాజా బ్యాటరీ కంపెనీలో, కియా మోటార్స్‌లో పనిచేసేందుకు అర్హత ఉన్న నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు. విశాఖపట్నం, తిరుపతి, విజయనగరంతో పాటు అవకాశం ఉన్న మిగతా చోట్ల కూడా స్వర్ణ వార్డు, గ్రామ సచివాలయాల్లో వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.