నీ బుర్రను మ్యూజియంలో పెట్టా.. ఏం తెలివిరా నాయనా..ఈ చోరీ చూస్తే ఫ్యూజులు ఔట్!

4 months ago 9
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడి వెంకటేశ్వరస్వామి ఆలయంలో.. ఓ దొంగ హుండీలోని డబ్బులను కాజేశాడు. దొంగ ఓ వైర్‌కు బబుల్గమ్ అంటించి హుండీలోని డబ్బులు ఒక్కొక్కటిగా లాగేయడం మెుదలుపెట్టాడు. ఇలా పలుసార్లు హుండీలోని డబ్బులు కాజేశాడు. అయితే ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో దొంగ అసలు బాగోతం రికార్డ్ అయ్యింది. హుండీ నుంచి డబ్బులు తీస్తున్న వీడియోలో దొంగ ముఖం స్పష్టంగా కన్పించింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Entire Article