నారాణయపేట జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. గత పదేళ్ల పాలనపై చర్చింద్దామంటూ రేవంత్ రెడ్డి చేసిన ఛాలెంజ్‌ను తాను స్వీకరిస్తున్నట్టు హరీష్ రావు తెలిపారు. టైమ్, ప్లేస్ చెప్పాలని.. కొడంగల్ నియోజకవర్గమైనా సరే, చివరికి తన ఇంట్లో అయినా సరే తాను రెడీ అని తెలిపారు. పాలమూరు అభివృద్ధి గురించి సీఎం రేవంత్ రెడ్డి పచ్చిఅబద్ధాలు చెప్పారంటూ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.