విశాఖపట్నంలో ప్రియుడు తనతో సన్నిహితంగా ఉండడం లేదన్న కోపంతో ఒక మహిళ అతని ఖరీదైన బైక్‌కు నిప్పు పెట్టింది. మంటలు వ్యాపించి 18 ద్విచక్ర వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. మొదటి అంతస్థుకు మంటలు వ్యాపించాయి. సీసీటీవీ ద్వారా ఘటన వెలుగులోకి వచ్చి, మహిళను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు చేశారు.