" నువ్వెంత.. నీ బతుకెంత.. మా కింద పాలేరువి".. అధికారిపై రెచ్చిపోయిన జనసేన నేత

2 months ago 4
ప్రభుత్వ అధికారిపై ఓ జనసేన నేత వీరావేశం ప్రదర్శించారు. నడిరోడ్డుపై దురుసుగా ప్రవర్తించారు. తోలు తీస్తా.. నువ్వెంత, నీ బతుకెంత అంటూ దుర్భాషలాడారు. నిబంధనల ప్రకారం నడుచుకోవటమే ఆ అధికారి తప్పైంది. ఈ ఘటన విజయవాడ రూరల్ మండలంలోని ఎనికేపాడులో చోటుచేసుకుంది. ఎనికేపాడు జనసేనలో రెండు వర్గాలు ఉన్నాయి. అయితే ఓ వర్గం వంగవీటి రంగా, గాంధీ విగ్రహాలను ఏర్పాటు చేసింది. మంగళవారం వీటిని ఆవిష్కరించేందుకు ప్రయత్నించగా.. అనుమతులు లేవని పంచాయతీ కార్యదర్శి అడ్డుకున్నారు. దీంతో గన్నవరం జనసేన ఇంఛార్జి చలమలశెట్టి రమేష్.. అధికారిపై దురుసుగా ప్రవర్తించారు.
Read Entire Article