నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్‌తో 1300 మంది విద్యార్థులకు పైగా అస్వస్థతకు గురయ్యారు. మెస్‌లో పురుగుల అన్నం పెట్టడంతో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొలుసు పార్థసారథి వచ్చినప్పుడు.. తమ సమస్యలు చెప్పనివ్వలేదని విద్యార్థులు ఆరోపించారు. ఐటీ క్యాంపస్‌లో ఉన్న వంట గదిలో.. పాత్రలు, గ్రైండర్లు కడగకుండానే వాడుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. పులిసిపోయిన పిండి, పాడైన పెరుగు, చపాతీల్లో మైదా పిండి కలుపుతున్నట్టు వెల్లడయ్యింది.