Nellore Women Protest To Start Liquor Shop In Village: ఒకప్పుడు మద్యం షాపు మా ఊళ్లో ఏర్పాటు చేయొద్దు బాబోయ్ అంటూ రోడ్డెక్కిన మహిళలు.. ఇప్పుడు తమ ఊరికి మద్యం షాపు కావాలని రోడ్డెక్కారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ ఇది నిజమే. నెల్లూరు జిల్లా గండిపాలెంలో ఈ విచిత్రమైన ఘటన జరిగింది. ఇలా మహిళలు మద్యం షాపు ఏర్పాటు చేయాలని ఆందోళన దిగడం వెనుక ఓ కారణం కూడా ఉందట.