నెల్లూరు ప్రజలకు శుభవార్త. రూపాయి అద్దెకే ఫంక్షన్ హాల్ అందుబాటులోకి వచ్చింది. పేద, మధ్యతరగతి ప్రజల కోసం నెల్లూరు నగరపాలక సంస్థ ఈ ఫంక్షన్ హాల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మంత్రి నారాయణ చేతుల మీదుగా ఆగస్ట్ 16న దీనిని ప్రారంభించారు. అప్పుడే రూపాయి అద్దెకే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై నెల్లూరువాసుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. శుభకార్యాల సమయంలో ఫంక్షన్ హాళ్ల కోసం భారీగా అద్దెలు చెల్లించాల్సి ఉండేదని.. ఈ ఫంక్షన్ హాల్ అందుబాటులోకి రావటంతో కొంచెం ఊరట లభించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.